కోదండరామ్ విడుదలయ్యారు

తెలంగాణా జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ను కొద్ది సేపటి క్రితమే పోలీసులు విడుదల చేశారు. ఆయనను వారే తమ జీపులో తార్నాకలోని ఆయన ఇంటివద్ద దింపి వెళ్ళారు. ఈరోజు నిరుద్యోగుల ర్యాలి చేయతలపెట్టినందున ముందస్తు జాగ్రత్త చర్యగా ఈరోజు తెల్లవారుజామున పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొన్నారు. ఆయనతో పాటు ఇంకా చాలా మంది జేఎసి నేతలను, విద్యార్ధి సంఘం నేతలను కూడా అరెస్ట్ చేశారు. వారందరినీ కూడా బేషరతుగా విడిచిపెట్టాలని ప్రతిపక్షాలు, ప్రొఫెసర్ కోదండరామ్ కోరుతున్నారు.