అమరావతిలోనే ఏపి శాసనసభ సమావేశాలు

ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు వెలగపూడిలో నిర్మించుకొన్న సచివాలయంలోనే నిర్వహించబడతాయి. శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఆ భవనంలో ప్రత్యేక సమావేశమందిరాలు, అధికార, ప్రతిపక్ష నేతలకు ఛాంబర్లు నిర్మించారు. 

మార్చి 6వ తేదీ నుంచి ఏపి శాసనసభ బడ్జెట్ సమావేశాలు మోదలయ్యి, రెండు వారాలు సాగే అవకాశం ఉంది. ఏపి సర్కార్ మార్చి 13న రాష్ట్ర బడ్జెట్ ను ఉభయసభలలో ప్రవేశపెట్టబోతోంది. గత ఏడాది రూ.1.36 లక్షల కోట్ల బడ్జెట్ కాగా ఈ ఏడాది అది రూ.1.54 లక్షల కోట్లు ఉండవచ్చని సమాచారం. ఈసారి బడ్జెట్ లో ఆచరణ సాధ్యమైన అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.