మాజీ తెరాస ఎంపి విజయశాంతి తమిళనాడు రాజకీయ పరిణామాలపై విభిన్నంగా స్పందించారు. ఆమె నేడు మీడియాతో మాట్లాడుతూ, “నేను శశికళ ముఖ్యమంత్రి కావాలని కోరుకొన్నాను. కానీ ఆమె జైలుకు వెళ్ళవలసి వచ్చింది. జయలలిత ఆకస్మిక మరణం తరువాత ఆమె అన్నాడిఎంకె పార్టీని కాపాడుకోవడానికి చాలా కష్టపడ్డారు. పన్నీర్ సెల్వం వంటి కొన్ని దుష్టశక్తులు కలిసి పార్టీని చీఎల్చి అధికారంలోకి రావడానికి ప్రయన్టించారు. కానీ శశికళ చాలా తెలివిగా పావులు కదిపి వారిని చిత్తూ చేశారు. ఆమె స్థానంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, విశ్వాస పరీక్షలో నెగ్గిన పళనిస్వామికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన తమిళనాడు రాష్ట్రంలో మళ్ళీ రాజకీయ సుస్థిరత నెలకొల్పి, రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తారని భావిస్తున్నాను,” అని అన్నారు.