మన దేశంలో ఎక్కడైనా బాంబు ప్రేలుళ్ళు జరిగితే, అది జరిగిన ఒకటి, రెండు దశాబ్దాల తరువాత తుది తీర్పులు వినిపిస్తుంటాయి. అప్పటికి అందరూ ఆ సంగతే మరిచిపోతారు కూడా. అక్టోబర్ 29, 2005న డిల్లీలో సరోజినీ నగర్, పహార్ గంజ్, కల్కాజీ అనే మూడు ప్రాంతాలలో ఒకేసమయంలో వరుస ప్రేలుళ్ళు జరిగాయి. వాటిలో 67మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆ కేసుపై ఎన్.ఐ.ఏ. దర్యాప్తు చేసి, దోషులను పట్టుకొని కోర్టులకు అప్పగించిన తరువాత మొదలైన విచారణ నేటికి ముగిసింది. అంటే సుమారు 11 సం.లు పట్టిందన్న మాట!
ఆ కేసును విచారించిన డిల్లీలోని పాటియాలా కోర్టు నేడు తీర్పు ప్రకటించింది. ముగ్గురు నిందితులలో మొహమ్మద్ రఫీక్ షా, మొహమ్మద్ హుస్సేన్ ఫాజిల్ అనే ఇద్దరిని దోషులని నిరూపించేందుకు సరైన ఆధారాలు చూపలేకపోయినందున వారిని నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేసింది. తారిక్ అహమద్ దార్ అనే వ్యక్తి ఈ నేరానికి పాల్పడినట్లు రుజువు అవడంతో అతనికి 10 ఏళ్ళు జైలు శిక్ష విదించింది. అతనికి సహకరించిన మరో ఐదుగురు వ్యక్తులు పాక్ ఆక్రమిత కాశ్మీర్ కి పారిపోయినట్లు సమాచారం.