ఈరోజు దేశంలో, తెలంగాణా రాష్ట్రంలో చాలా ఆసక్తికరమైన పరిణామాలు జరుగబోతున్నాయి. ఆ వివరాలు క్లుప్తంగా:
1. ఈరోజు ఉదయం సరిగ్గా 9.28గంటలకు ఇస్రో సంస్థ ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరికక్ష్యలోకి ప్రవేశపెట్టబోతోంది. నిన్న తెల్లవారుజాము నుంచి దానికోసం మొదలైన కౌంట్ డౌన్ నిర్విఘనంగా సాగుతోంది. అంటే అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టడానికి ఎటువంటి సాంకేతిక అవాంతరాలు లేవని స్పష్టం అవుతోంది. ఈ ప్రయోగం విజయవంతం అయితే ప్రపంచంలో ఒకేసారి అన్ని ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన ఖ్యాతి భారత్ కే దక్కుతుంది. ఇస్రోపై ఆ నమ్మకం ఉండబట్టే సాంకేతికంగా మన కనతే చాలా అభివృద్ధి చెందిన అమెరికా, ఇజ్రాయిల్ వంటి దేశాలు 101 ఉపగ్రహాలను ఇస్రో ద్వారా నేడు అంతరిక్షంలోకి పంపించుకొంటున్నాయి. ఈ ప్రయోగం విజయవంతం అయ్యి ఇస్రో, భారత్ పేరు ప్రతిష్టలు మరింత పెరుగాలని కోరుకొందాము.
2. నేడు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్, భాజపాల మద్యనే ప్రధానంగా పోటీ ఉంది. ఉత్తరప్రదేశ్ లో భాజపా, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ, సమాజ్ వాదీ+కాంగ్రెస్ పార్టీల మద్య పోటీ నెలకొని ఉంది.
3. అక్రమాస్తుల కేసులో 4 ఏళ్ళు జైలు శిక్ష ఖరారయిన శశికళ, ఆమె మరదలు ఇళవరసి, మేనల్లుడు సుధాకరన్ ఈరోజు బెంగళూరు ప్రత్యేక కోర్టులో లొంగిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. తమిళనాడులో ఇప్పుడు పన్నీర్ సెల్వం, పళనిస్వామిలలో ఎవరికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందనే సంగతి గవర్నర్ విద్యాసాగర్ రావు తేల్చవలసి ఉంది. ఆయన నిన్న ఇద్దరితోను వేర్వేరుగా మాట్లాడారు.
4. నేడు గజ్వేల్ ల్లో ప్రజాపోరు పేరిట తెదేపా నిరసన సభ నిర్వహించబోతోంది.