రామేశ్వరరావు చేతికి భద్రాద్రి?

మై హోమ్ సంస్థల అధినేత జూపల్లి రామేశ్వర రావుని భద్రాచలం ఆలయబోర్డు చైర్మన్ గా నియమించబోతున్నట్లు తాజా సమాచారం.  మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, చిన్న జియ్యర్ స్వామితో కలిసి జూపల్లి రామేశ్వర రావు కొన్ని రోజుల క్రితమే భద్రాచలం పుణ్యక్షేత్రానికి వచ్చి ఆలయాభివృద్ధికి చేపట్టవలసిన పనుల గురించి చర్చించారు. ఆలయాభివృద్ధి కోసం రూ.100 కోట్లు మంజూరు చేస్తానని కేసీఆర్ ఇదివరకే హామీ ఇచ్చారు. అది ఈసారి బడ్జెట్ లో కేటాయించే అవకాశం ఉంది.