టిబెట్ కు చెందిన ప్రముఖ బౌద్ద గురువు ఆదివారం హైదరాబాద్ లో దలైలామా సెంటర్ ఫర్ ఎథిక్స్ అండ్ ట్రాన్స్ ఫర్ మేటివ్ వాల్యూస్ అనే సంస్థకు శంఖుస్థాపన చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ధర్మం, శాంతి, అహింస అనే మూడు గొప్ప లక్షణాలు కలిగిన దేశం భారత్. అనాదిగా భారత్ ఈ లక్షణాలు కలిగి ఉంది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే భారత్ గొప్పదనాన్ని ప్రపంచదేశాలు గుర్తించాయి. ఇప్పుడు ప్రపంచంలో నెలకొన్న అరాచక పరిస్థితుల దృష్ట్యా అందరూ ఈ మూడు సుగుణాలను అలవరుచుకోవలసిన అవసరం చాలా ఉంది. నేను అనేక దేశాలు తిరిగాను. ఎక్కడికి వెళ్ళినా నేను ఒక భారతీయుడిగానే అనుభూతి చెందుతుంటాను. ఎందుకంటే పుణ్యభూమి అయిన భారతదేశంతో నేను అంతగా మమేకం అయిపోయాను,” అని దలైలామా అన్నారు.
దక్షిణాసియాలో ఈ దైలైలామా సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్ నగరాన్ని ఎంచుకొన్నందుకు మంత్రి కేటిఆర్ దలైలామాకు కృతజ్ఞతలు తెలిపారు. దాని కోసం హైదరాబాద్ శివార్లలో హైటెక్స్ వద్ద అవసరమైన భూమిని, భవన నిర్మాణం కోసం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 కోట్లు విరాళాన్ని మంత్రి కేటిఆర్ ప్రకటించారు.
దైలైలామా సెంటరులో దేశవిదేశాలకు చెందిన వివిధ సంస్థలలో పనిచేస్తున్నవారికి, రాష్ట్రంలోని విద్యార్ధులు, ఉపాద్యాయులు మొదలైనవారికి జీవనప్రయాణంలో నైతికవిలువలను ఏవిధంగా ఆచరించాలి, ఇతరులకు కూడా వాటిని ఆచరించే ఏవిధంగా ఆచరించేలా ప్రోత్సహించాలి వంటి అనేక విషయాలను అక్కడ భోధిస్తారు.