సంబంధిత వార్తలు
నిజామాబాద్ తెరాస ఎంపి కవిత అమరావతిలో జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు హాజరైనప్పుడు, కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇవ్వాలని, దానికి తాము కూడా మద్దతు ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ అందుకు కవితక్కకు కృతజ్ఞతలు తెలిపారు. “ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తామని చెప్పినందుకు నిజామాబాద్ ఎంపి కవితగారికి నేను మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండూ సమస్యల పరిష్కారానికి ఒకదానికి మరొకటి ఇదేవిధంగా సహకరించుకోవాలి. కలిసి ఉంటే నిలబడగలుగుతాము విడిపోతే పడిపోతాము. జై హింద్,” అని ట్వీట్ చేశారు.