నేడు విజయవాడ వెళ్ళనున్న కవితక్క

నేటి నుంచి 3 రోజులపాటు విజయవాడలో జరుగబోయే మహిళా పార్లమెంటు సదస్సు జరుగబోతోంది. దానిలో పాల్గొనేందుకు నిజామాబాద్ తెరాస ఎంపి కవిత విజయవాడ వెళ్ళబోతున్నారు. ఆమె ముందుగా బెజవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసు కొని అక్కడి నుంచి సదస్సుకు హాజరవుతారు. మధాహ్నం 2.45గంటలకు ఆమె సదస్సుకు వచ్చిన మహిళా సభ్యులను ఉద్దేశ్యించి ప్రసంగిస్తారు.

కృష్ణా నదీతీరాన్న ఇబ్రహీంపట్టణం వద్ద జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ డిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభిస్తారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రసంగంతో సదస్సు ప్రారంభం అవుతుంది. దేశవిదేశాల నుంచి వివిధ రంగాలలో పేరు ప్రఖ్యాతులు కలిగిన అనేకమంది మహిళలు ఈ సదస్సులో పాల్గొని మహిళా సమస్యలతో సహా వివిధ అంశాలపై ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ బౌద్ద గురువు దైలలామా విశిష్ట అతిధిగా ఆహ్వానించబడ్డారు. శ్రీలంక అధ్యక్షుడు భార్య మరియు ఆ దేశ ప్రధమ పౌరురాలు మైత్రేయి విక్రమ సింఘ, అమెరికా సెనేటర్ అరుణ్ మిల్లర్, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, స్మృతీ ఇరానీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వంటి అనేకమంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 

ఈ సదస్సు ముఖ్యోదేశ్యాలు: విభిన్న రంగాలలో తమ ప్రతిభ చాటుకొన్న మహిళల ద్వారా విద్యార్ధినులకు మార్గదర్శనం చేయించడం. విభిన్న అంశాలపై వారి మద్య చర్చలు నిర్వహించి, విద్యార్ధినులలో అవగాహనా పెంపొందించడం. మహిళా సాదికారికత, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాలు, ఈ విషయంలో అనుసరించదగ్గ వ్యూహాలు, పధకాల గురించి ప్రభుత్వాలకి తగు సూచనలు, సలహాలు ఇవ్వడం వంటి అనేక అంశాలపై ఈ సదస్సుముఖ్యోదేశ్యం.