పరిశ్రమలలో పనిచేస్తున్న ఉద్యోగులందరి జీతాలు ఇక నుంచి తప్పనిసరిగా చెక్కుల రూపంలో కానీ ఆన్-లైన్ ద్వారా నేరుగా వారి ఖాతాలలో జమా చేయడం ద్వారా మాత్రమే చెల్లించాలనే బిల్లుని లోక్ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. జీతభత్యాల చెల్లింపు చట్టానికి సవరణగా దీనిని ఆమోదించారు.
ఈ బిల్లు వలన అటు ఉద్యోగులకు, ప్రభుత్వానికి కూడా కొన్ని లాభాలు ఉన్నాయి.
1. ఉద్యోగులు లేదా కార్మికుల జీతాలు బ్యాంకుల ద్వారానే చెల్లించవలసి ఉంటుంది కనుక కార్మిక చట్టాల ప్రకారం నిర్దేశించిన కనీస వేతనాలు తప్పనిసరిగా చెల్లించవలసి ఉంటుంది.
2. సంస్థలు తమ ఉద్యోగులకు అవి పనికి తగ్గ జీతాలు, వాటిపై పిఎఫ్ వగైరాలు సకాలంలో చెల్లిస్తున్నాయా లేదా అనే విషయం ఇప్పుడు కార్మిక శాఖకు తెలిసిపోతుంది.
3. జీతాల చెల్లింపులలో అనేక అవకతవకలకు పాల్పడుతున్న పరిశ్రమల ఆటకట్టవుతుంది.లేని ఉద్యోగులు ఉన్నట్లు చూపిస్తూ దొంగలెక్కలు చూపడానికి అవకాశం ఉండదు.