ఎమ్మెల్సీ ఎన్నికల గంట మ్రోగింది

ఏపి, తెలంగాణా, బిహార్ రాష్ట్రాలలో త్వరలో ఖాళీ కాబోతున్న 10 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమీషన్ సోమవారం షెడ్యుల్ ప్రకటించింది. తెలంగాణాలో హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల పట్టభద్రులు-ఉపాద్యాయ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాటేపల్లి జనార్ధన్ రెడ్డి పదవీ కాలం వచ్చే నెల 29వ తేదీతో ముగుస్తుంది. కనుక ఆ స్థానానికి ఎన్నికలు జరుగబోతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ఈవిధంగా ఉంటుంది.

ఎన్నికలకు నోటిఫికేషన్: ఫిబ్రవరి 13

నామినేషన్లు వేయడానికి ఆఖరు తేదీ: ఫిబ్రవరి 20

నామినేషన్ల పరిశీలన: ఫిబ్రవరి 21

నామినేషన్ల ఉపసంహరణకు గడువు: ఫిబ్రవరి 23

పోలింగ్ తేదీ: మార్చ్ 9 (ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు)

ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి: మార్చ్ 15

ఎన్నికల ప్రక్రియ ముగింపు తేదీ: మార్చ్ 18. 

ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడింది కనుక నేటి నుంచే ఆయా జిల్లాలలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ఎన్నికల కమీషన్ ప్రకటించింది.