ఇంతకాలంగా హైదరాబాద్ లోనే ఆంధ్రా నేతలందరూ ఉండేవారు కనుక వారు హైదరాబాద్ వచ్చి వెళుతున్నా ఎవరూ ఆశ్చర్యపోరు. కానీ తెలంగాణా మంత్రులు చాలా అరుదుగా ఆంధ్రాలో కాలుపెడుతుంటారు. ఎక్కువగా తిరుపతిలోనే కనబడుతుంటారు. కనుక వేరే ప్రాంతంలో ఎక్కడైనా తెరాస లేదా తెలంగాణా నేతలు, ప్రజా ప్రతినిధులు కనబడితే అది వార్తే అవుతుంది. రాష్ట్రం హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి విశాఖలో గల శారదాపీఠం వార్షికోత్సవాలకు హాజరవడం విశాఖవాసుల దృష్టిని ఆకట్టుకొంది. ఆయన శారద పీఠంలో స్వామి సరూపానందేంద్ర అద్వర్యంలో జరిగిన హోమాలు, పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆయనతో బాటు ఏపి తెదేపా, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు.