రైల్వే బడ్జెట్ లో తెలంగాణాకి ఏమేమి ఇచ్చారంటే..

ఈసారి రైల్వే బడ్జెట్ లో తెలంగాణా రాష్ట్రానికి కేటాయించిన కొత్త రైళ్ళు, రైల్వే లైన్లు, నిధుల వివరాలు ఈవిధంగా ఉన్నాయి.

1. బొల్లారం, ముకుంద్ మద్య కిమీ రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు సర్వే. 

2. మౌలాలి వద్ద ఈఎంయూ కార్ షెడ్ కోసం రూ.5.86కోట్లు.

3. కాజీపేట-బలార్షా మద్య 4వ లైన్ నిర్మాణానికి సర్వే.

4. కాజీపేట-విజయవాడ మద్య 3వ లైన్ నిర్మాణానికి రూ.100కోట్లు.

5. కాజీపేట-విజయవాడ మద్య 4వ లైన్ నిర్మాణానికి సర్వే.

6. కాజీపేట-విజయవాడ మద్య 4వ లైన్ నిర్మాణానికి సర్వే.

7. కాజీపేట-విజయవాడ మరియు ఏపిలో రేణిగుంట, గుత్తి బైపాస్ లైన్లకు కలిపి రూ.135 కోట్లు.

8. సికింద్రాబాద్-మహబూబ్ నగర్ డబ్లింగ్ పనులకు రూ. 50 కోట్లు

9. పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి రూ.25 కోట్లు.

10. పెద్దపల్లి-మంచిర్యాల్ 3వ లైన్ నిర్మాణానికి రూ.100కోట్లు.

11. మహబూబ్ నగర్-మునీరాబాద్ రైల్వేలైన్ నిర్మాణానికి రూ.300 కోట్లు. 

12. యాద్రాద్రి-ఘాట్ కేసర్ ఎంఎంటిఎస్ రైల్వే లైన్ పొడిగింపుకు రూ.16కోట్లు.

13. రెండు తెలుగు రాష్ట్రాలలో 4 రైల్వే లెవెల్ క్రాసింగ్స్ లకు రూ.19 కోట్లు.