తెలంగాణా మంత్రివర్గ నిర్ణయాలు

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. దానిలో ఈనెల శాసనసభలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో  చేర్చవలసిన అంశాలపై చర్చించారు. ఉద్యోగాల భర్తీ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్ట సవరణ తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకొన్నారు. ఆ వివరాలు:

1. బాషా పండితులు, పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్స్ గా పదోన్నతి చేయడానికి ఆమోదం.

2. మిషన్ భగీరథ ప్రాజెక్టు కోసం 380 పోస్టులు భర్తీకి ఆమోదం.

3. రాష్ట్రంలో 26 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ఖాళీగా ఉన్న 60 పోస్టుల భర్తీకి ఆమోదం.

4. పీవీ నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయానికి అదనంగా 10 పోస్టులు మంజూరు. 

5. కొన్ని శాఖలలో ఉద్యోగులను పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న శాఖలకి మార్చేందుకు ఆమోదం.  

6. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్ట సవరణకు ఆమోదం.

7. మహబూబ్ నగర్ వైద్య కళాశాలకు రూ. 519 కోట్లు మంజూరుకు ఆమోదం.

8. కరీంనగర్ లో ఫిషరీస్ కాలేజీ ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్.

9. కొత్తగా ఏర్పాటు చేసిన అన్ని జిల్లాలలో 12 నెలలో ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ల నిర్మాణం.  

10. మైనార్టీల కోసం మైనార్టీ గురుకులాల ఏర్పాటుకు ఆమోదం.

11. తక్షణం సాగునీరు అందించగల అవకాశాలున్న ఎత్తిపోతల ప్రాజెక్టులపై అధ్యయనం చేసేందుకు మంత్రి హరీష్ రావు నేతృత్వంలో మంత్రులు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర రావులతో కూడిన ఒక కమిటీ ఏర్పాటు.

12. కాళేశ్వరం, మల్లన్న సాగర్, కొండపోచమ్మ, గంధమల్ల, బస్వాపూర్, జలాశయాల సామర్ధ్యం పెంపుకి ఆమోదం.  

13. దేవాదుల పరిధిలో స్టేషన్ ఘన్ పూర్ మండలంలో మల్కాపూర్ వద్ద జలాశయం నిర్మాణానికి ఆమోదం. దేవాదుల 3వ దశ పనులకు రూ.1100 కోట్లు కేటాయింపుకి ఆమోదం.

14. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆంధ్రా బ్యాంక్ నుంచి రూ. 7860 కోట్లు రుణం తీసుకోవాలని నిర్ణయించారు.

15. నానాటికీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరానికి మంచినీరు సరఫరా కోసం ప్రత్యేకంగా జలాశయం నిర్మించాలని నిర్ణయించారు.

16. కాంతనపల్లి బ్యారేజికి బదులు తుపాకుల గూడెం వద్ద బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించారు.

17. రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులు రద్దు.