కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ప్రస్తుతం పార్లమెంటులో ప్రవేశపెడుతున్న ఆర్ధిక బడ్జెట్ 2017-18లో ప్రధానాంశాలు:
బడ్జెట్ లో వివిధ రంగాలకు కేటాయింపులు:
1. మొత్తం బడ్జెట్: రూ.21,47,000 కోట్లు
2. జీడీపీలో ద్రవ్యలోటు 3.2 శాతం, రెవెన్యూ లోటు 2.1 శాతం.
3. రక్షణ రంగానికి రూ.2,74,114 కోట్లు.
4. రైల్వేలకి రూ. 1,31,000 కోట్లు
5. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.3,96,134 కోట్లు
6. జాతీయ రహదారులు నిర్మాణం, నిర్వహణ కొరకు రూ.64,000 కోట్లు.
7. టెలికాం రంగానికి రూ.10,000 కోట్లు
8. నేషనల్ హౌసింగ్ బ్యాంకుకు రూ.20,౦౦౦ కోట్లు
9. ముద్రా రుణాల కోసం రూ.2,44,000 కోట్లు
10. మొబైల్ పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రూ.745 కోట్లు
11. జాతీయ ఉపాధి హామీ పథకానికి రూ.48,000 కోట్లు
12. ప్రధాని ఆవాస్ యోజన పథకానికి రూ.23,000 కోట్లు
13. ప్రధానమంత్రి సడక్ యోజనకు రూ.19,000 కోట్లు
14. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి రూ.52 వేల 393 కోట్లు
15. వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి రంగాలకు రూ.1,87,000కోట్లు
16. జాతీయ ఉపాధి హామీ పథకానికి రూ.48,000 కోట్లు
17. దేశవ్యాప్తంగా గ్రామాలలో మహిళ శక్తి కేంద్రాలు ఏర్పటుకు రూ. రూ.500 కోట్లు.
18. సంకల్ప్ స్కీమ్ (స్కిల్ డెవలప్మెంట్)కు రూ.4,000 కోట్లు
19. పాడిపరిశ్రమ అభివృద్ధికి రూ. 8000 కోట్లు.
20. మైక్రో ఇరిగేషన్ కోసం రూ.5000 కోట్లు.
ఆదాయపన్ను పరిమితులు, వడ్డింపులు:
1. రూ.2.5 లక్షల వరకు వార్షికాదాయంపై పన్ను లేదు.
2. రూ.2.5-5 లక్షల వార్షికాదాయం గలవారి నుంచి వసూలు చేస్తున్న 10శాతం ఆదాయపన్ను 5 శాతానికి తగ్గించబడింది.
3. రూ.కోటి పైన వార్షికాదాయం గలవారిపై గతంలో విదించిన 15 శాతం సర్-చార్జ్ కొనసాగుతుంది.
4. రూ.50 లక్షల నుంచి కోటి రూపాయలు వార్షికాదాయం గలవారిపై 10 శాతం సర్-చార్జ్.
5. ప్రస్తుతం మూడేళ్ళున్న క్యాపిటల్ గెయిన్స్ దీర్గకాలం కాలపరిమితిని రెండేళ్ళకు తగ్గించబడింది. అలాగే దానికి ప్రామాణికంగా తీసుకొంటున్న (బేస్ ఇండెక్సింగ్) తేదీ: 1.4.1981ను 1.4.2001కి మార్చబడింది.
6. రూ.3లక్షల కంటే ఎక్కువగా నగదు లావాదేవీలకు అనుమతి నిరాకరణ.
7. రూ.50 కోట్లు కంటే తక్కువ వార్షిక టర్నోవర్ కలిగిన కంపెనీలు ప్రస్తుతం చెల్లిస్తున్న 30శాతం ఆదాయపన్నులో 5శాతం తగ్గించబడింది. ఇప్పుడు 25శాతం చెల్లిస్తే సరిపోతుంది.
8. ఎల్.ఎన్.జి. (గ్యాస్)పై కస్టమ్స్ డ్యూటీ 5 నుంచి 2 శాతానికి తగ్గించబడింది.
9. రాజకీయ పార్టీలకు రూ.2000 కంటే నగదు రూపంలో విరాళాలు స్వీకరించకూడదు.
10. తెలంగాణాలో ప్రాజెక్టుల కోసం, ఆంధ్రాలో అమరావతి కోసం ఇచ్చిన భూములకు ప్రభుత్వాలు చెల్లించిన నష్టహారాన్ని క్యాపిటల్ గెయిన్స్ పరిధి నుంచి మినహాయింపు ఇవ్వబడింది.
11. చెక్ బౌన్స్ కేసులలో నష్టపోయినవారికి పరిహారం ఇప్పించేందుకు చట్ట సవరణ చేయబడుతుంది.
బడ్జెట్ లో ఇతర అంశాలు:
గృహరుణాల వడ్డీ రేట్లు తగ్గింపు
దేశ వ్యాప్తంగా గ్రామాలలో కోటి పక్కా ఇళ్ళ నిర్మాణం.
కృషి విజ్ఞాన్ కేంద్రాలలో భూసార పరీక్షలకు ఏర్పాట్లు.
వ్యవసాయ సహకార సంఘాలను నాబార్డ్ తో అనుసంధానం.
1.5 లక్షల గ్రామపంచాయితీలకు హై-స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సౌకర్యం.
రెండు నెలలోగా పంట రుణాలు చెల్లించిన రైతులకు వడ్డీ మాఫీ.
పోష్టాఫీసుల ద్వారా పార్లమెంటు సమావేశాలు పోర్ట్స్ జారీకి చర్యలు.
దేశవ్యాప్తంగా ఉన్న ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను వెల్ నెస్ సెంటర్లుగా అభివృద్ధి చేయబడుతాయి.
వికలాంగులకు అనుకూలమైన 5000 రైల్వే స్టేషన్ల నిర్మాణం.
ఎఫ్.డి.ఐ.పాలసీలో సంస్కరణలు.
దేశీయంగా మొబైల్ ఫోన్స్ తయారీకి ప్రోత్సాహకాలు.
జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాలలో ఎయిమ్స్ ఆసుపత్రులు ఏర్పాటు.
ఉన్నత విద్యల ప్రవేశ పరీక్షలలో మార్పులు.
రక్షణ శాఖ విశ్రాంత ఉద్యోగులకు పింఛన్ సేవల కోసం వెబ్ సైట్ ప్రారంభం
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి 20 లక్షల ఆధార్ ఆధారిత స్వైపింగ్ యంత్రాల కొనుగోలు.
ఆర్థిక నేరస్తుల ఆస్తులను స్వాధీనం చేసుకొనేందుకు వీలుగా త్వరలో కొత్త చట్ట రూపకల్పన.