మాజీ కేంద్రమంత్రి, కేరళ ఎంపి ఈ.అహ్మద్ నిన్న పార్లమెంటులో కుప్పకూలగానే ఆసుపత్రికి తరలించారు. కానీ ఆయన మరణించారు. కనుక ఈరోజు పార్లమెంటులో ఆయన మృతికి సంతాపం తెలిపి బడ్జెట్ ను రేపటికి వాయిదా వేయాలని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖార్గే కేంద్రప్రభుత్వాన్ని కోరారు. కానీ రాష్ట్రపతి ఆదేశానుసారం ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినందున దానిని వాయిదా వేయలేమని స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు డిల్లీలోని ఈ.అహ్మద్ నివాసానికి వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపివచ్చారు. పార్లమెంటు ఉభయ సభలలో కూడా ఆయన ఆకస్మిక మృతికి సంతాపం తెలిపిన తరువాత అరుణ్ జైట్లీ కొద్ది సేపటి క్రితమే బడ్జెట్ లో ముఖ్యాంశాలను సభకు వివరించడం మొదలుపెట్టారు. ఊహించినట్లుగానే ముందుగా నోట్ల రద్దు వలన కలిగిన సమస్యలను భరించి ప్రభుత్వానికి అండగా నిలబడినందుకు ఆయన దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మరికొద్ది సేపటిలో బడ్జెట్ హైలైట్స్ గురించి తెలియజేస్తాము.