కేసీఆర్ కి సేవలు చేసిన వాళ్ళం..పట్టించుకోరా?

హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న 220 మంది నర్సులు గత కొన్ని రోజులుగా తమను రెగ్యులరైజ్ చేయాలనీ డిమాండ్ చేస్తూ ఆందోళనలు సాగిస్తున్నారు. ఇవ్వాళ్ళ ఆసుపత్రి భవనంపైకి ఎక్కి విన్నూత్నంగా నిరసనలు తెలియజేస్తున్నారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరిస్తే తప్ప క్రిందకు దిగమని చెపుతున్నారు.

వారి ప్రతినిదులు మీడియాతో మాట్లాడుతూ “ఆనాడు కేసీఆర్ తెలంగాణా సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు మా నర్సులే దగ్గరుండి ఆయనకి ఆసుపత్రిలో సేవలు చేశారు. కానీ ఇప్పుడు ఆయన మమ్మల్ని పట్టించుకోవడం లేదు. తెరాస అధికారంలోకి వస్తే తాత్కాలిక నర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చారు. గత ఏడాది రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి కూడా హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు. చాలీ చాలని జీతాలతో చాలా దుర్భరమైన జీవితాలు గడుపుతున్నాము. మాకు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ప్రభుత్వం మా అందరినీ తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాము,” అని గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున నర్సులు డిమాండ్ చేస్తున్నారు.