జగన్ గ్రేట్, పవన్ లేట్: వర్మ

రామ్ గోపాల్ వర్మ ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ పైకి తన ట్విట్టర్ అస్త్రాలను సందించారు. ఈరోజు కొందరు యువకులు ప్రత్యేక హోదా కోరుతూ విశాఖలో తలపెట్టిన మౌనదీక్ష, కొవ్వొతుల ర్యాలీకి జగన్మోహన్ రెడ్డి వచ్చారు కానీ పవన్ కళ్యాణ్ రాలేదు. అది వర్మ నోటికి పని కల్పించినట్లయింది. 

“జగన్మోహన్ రెడ్డి ఒక వీరుడులా ఈ ఉద్యమంలో పాల్గొనేందుకు కదిలివచ్చి దాని పట్ల తన నిబద్దతను చాటుకొన్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడో దూరంగా కూర్చొని ట్విట్టర్ ద్వారా యుద్ధం చేస్తున్నారు. నిజమైన వీరుడు సురక్షితమైన ప్రదేశంలో ఫోన్ పట్టుకొని యుద్ధం చేయడు. కత్తి పట్టుకొని యుద్దరంగం మద్యలో నిలుచుంటాడు. పవన్ యుద్ద క్షేత్రంలోకి ఇంకా ఎప్పుడు వస్తారు? సైన్యాధ్యక్షుడు లేకుండా యుద్ధం ఎలా సాగుతుంది? ప్రజలను పోరాడమని ప్రోత్సహించి, అతను వారికి దూరంగా ఉండటం నన్ను చాలా నిరాశపరిచింది. ఒకవేళ ఈరోజు పవన్ కళ్యాణ్ వచ్చి ఉండి ఉంటే పరిస్థితి మరొకలాగ ఉండేది. ఈరోజు విఫలం అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ రేపు ఏదో మాష్టర్ ప్లాన్ తో వచ్చి ఈ పోరాటాన్ని తప్పకుండా హిట్ చేస్తాడని నేను భావిస్తున్నాను,” అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.