కేంద్రప్రభుత్వం ప్రతీ ఏటా గణతంత్రదినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో అపూర్వమైన కృషి చేసినవారికి, ప్రతిభ కనబరిచిన వారికీ ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటిస్తుంటుంది. ఈ ఏడాది 89మందికి ఈ పద్మా అవార్డులను ప్రకటించింది. వాటి మళ్ళీ అత్యున్నతమైనదిగా భావించబడే పద్మవిభూషణ్ అవార్డులను ఏడు మందికి, దాని తరువాత స్థానంలో నిలిచే పద్మభూషణ్ అవార్డులు ఏడు మందికి, పద్మశ్రీ అవార్డులు 75 మందికి ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డులు ఎవరికీ రాలేదు. తెలంగాణా రాష్ట్రానికి చెందిన 6మందికి, ఆంధ్రకు చెందిన ఇద్దరికీ పద్మశ్రీ అవార్డులు లభించాయి. సాదారణంగా ఈ అవార్డుల ప్రదానోత్సవం మార్చి-ఏప్రిల్ నెలల మద్య రాష్ట్రపతి భవన్ లో జరుగుతుంది.
ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలలో పద్మశ్రీ అవార్డులు అందుకోబోతున్నవారి వివరాలు
తెలంగాణా రాష్ట్రంలో వికసించిన పద్మాలు”
1. డా. ప్రొఫెస్సర్ ఏ.యాదగిరి రావు-ఆర్ట్ మరియు శిల్పకళ
2. త్రిపురనేని హనుమాన్ చౌదరి- సివిల్ సర్వీస్
3. డా.అబ్దుల్ మొహమ్మద్ అబ్దుల్ వహీద్- వైద్యం
4. పి. చంద్రకాంత్- సైన్స్ అండ్ ఇంజనీరింగ్
5. దరిపల్లి రామయ్య-సామాజిక సేవ
6. మోహన్ రెడ్డి వెంకటరామ బొండాపు- వాణిజ్యం మరియు పరిశ్రమలు
ఆంధ్రప్రదేశ్ పద్మాలు:
7. వి.కోటేశ్వరమ్మ-సాహిత్యం మరియు విద్య
8. సి హెచ్. మల్లేశం-సైన్స్ మరియు ఇంజనీరింగ్