సంబంధిత వార్తలు
తమిళనాడు సంప్రదాయ జల్లికట్టు ఎద్దుల క్రీడపై సుప్రీంకోర్టు విదించిన నిషేధం ఎత్తివేయాలని కోరుతూ ఆ రాష్ట్రంలో లక్షలాది ప్రజలు, అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు, సినీ తారలు అందరూ ఆందోళన కార్యక్రమం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రహమాన్ కూడా వారికి సంఘీభావం తెలియజేస్తూ శుక్రవారం ఒకరోజు నిరాహర దీక్ష చేయాలని నిశ్చయించుకొన్నారు. నలుగురితో నారాయణ అనకపోతే తమిళనాడులో ఎంత పెద్దవారికైనా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. కనుక తమిళ సినీ పరిశ్రమకు చెందినవారందరూ కూడా నిరాహార దీక్షలు మొదలుపెట్టినా ఆశ్చర్యం లేదు.