యుద్దానికి ముందు అస్త్ర సన్యాసం

ఫిబ్రవరి 11 నుంచి యూపిలో శాసనసభ ఎన్నికలు మొదలవబోతున్నాయి. అంటే నేటికి ఇంకా నెలరోజులు కూడా సమయం లేదు. కానీ ఇంతవరకు అధికార సమాజ్ వాదీ పార్టీలో తండ్రీకొడుకులు పార్టీపై ఆధిపత్యం కోసం కుమ్ములాడుకొంటూనే ఉన్నారు. ఎన్నికల కమీషన్ ఇవ్వాళ్ళ ఆ విషయం తేల్చవచ్చు. వారిద్దరి కుమ్ములాటలు పూర్తయి వారిద్దరిలో ఆ పార్టీ ఎవరికి దక్కితే వారితో పొత్తులు పెట్టుకొందామని కాంగ్రెస్ పార్టీ ఎదురుచూస్తోంది.

ఇక మరో ఆసక్తిపరిణామం ఏమిటంటే, తండ్రీకొడుకుల మద్య గొడవలకు మూలకారకుడైన అమర్ సింగ్ హటాత్తుగా అస్త్ర సన్యాసం చేశారు. కానీ అదే కారణమని చెప్పకుండా చికిత్స కోసం లండన్ వెళ్ళబోతున్నట్లు చెప్పారు. మళ్ళీ మార్చి నెలాఖరుకి తిరిగి వస్తానని చెప్పారు. అంటే ఎన్నికల ఫలితాలు (మార్చి 11) వెలువడిన తరువాత వస్తారన్న మాట. అప్పటికి రాష్ట్ర రాజకీయాలలో, సమాజ్ వాదీ పార్టీ పరిస్థితులపై పూర్తి స్పష్టత వస్తుంది కనుక అప్పటి పరిస్థితిని ములాయం సింగ్ తో కలిసి సాగగలరా లేదా? అనే విషయంపై స్పష్టత వస్తుంది కనుక మూలాయం సింగ్ పంచన చేరవచ్చా లేదా అనేది కూడా తేలిపోతుంది.