మన యాప్ కే బంగారు పతకం

హైదరాబాద్ సిటీ పోలీస్ రూపొందించిన “హాక్ ఐ యాప్” బంగారు పతకం గెలుచుకొంది. విశాఖపట్నంలో జరిగిన నేషనల్ ఈ-గవర్నెన్స్ మూడు రోజుల సదస్సులో దేశంలో అన్ని రాష్ట్రాల ప్రతినిధులు, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అనేకమంది విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ సదస్సుకు రాష్ట్ర పోలీస్ శాఖ తరపున హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఆ సదస్సులో హైదరాబాద్ సిటీ పోలీస్ రూపొందించిన “హాక్ ఐ యాప్” బంగారు పతకం, రూ.2 లక్షల నగదు గెలుచుకొంది. నేర నియంత్రణ కోసం రూపొందించిన యాప్ లలో అది అత్యుత్తమైన యాప్ గా గుర్తిస్తూ ఒక ప్రశంసాపత్రం కూడా ఇచ్చారు.

ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, “ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది మన పోలీస్ శాఖే రూపొందించినప్పటికీ ప్రజలందరూ సహకరించడం వలననే అది బాగా వినియోగించబడింది. నగరంలో నేరాల సంఖ్య కూడా తగ్గింది,” అని అన్నారు.