పాకిస్తాన్ కూడా విజయవంతంగా క్షిపణి పరీక్ష

భారత్ ఎప్పుడు క్షిపణి పరీక్ష జరిపిన కొన్ని రోజుల వ్యవధిలోనే పాకిస్తాన్ కూడా క్షిపణి పరీక్ష నిర్వహించి తన సత్తా చాటుకొనే ప్రయత్నం చేస్తుంటుంది. ఇటీవల భారత్ అగ్ని సిరీస్ లో ఐదవదైన అగ్ని-5 క్షిపణి ప్రయోగం ని విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అణ్వస్త్ర సామార్ధ్యం గల అగ్ని-5 సుమారు 5,000 కిమీ దూరంలో గల లక్ష్యాలను చేదించగలదు.

కనుక పాకిస్తాన్ కూడా అణ్వస్త్ర సామార్ధ్యం గల మద్యరకం క్షిపణిని సోమవారం విజయవంతంగా ప్రయోగించింది. సబ్ మెరైన్ నుంచి ప్రయోగించగల ఈ బాబర్-3 క్షిపణి సుమారు 450 కిమీ దూరంలోగల లక్ష్యాలను అవలీలగా చేదించగలదని పాక్ మిలటరీ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ రకం క్షిపణి రెండవ దశ దాడులకు చాలా ఉపయోగపడుతుందని తెలిపారు.