పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్టాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ని ప్రధాన ఎన్నికల కమీషనర్ నసీం జైదీ ప్రకటించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఈవిధంగా ఉంది:
ఉత్తరప్రదేశ్:
మొత్తం సీట్లు: 403.
మొత్తం 7 దశలలో ఎన్నికలు నిర్వహించబడతాయి.
ఎన్నికల తేదీలు: ఫిబ్రవరి 11న: (73 నియోజక వర్గాలు), ఫిబ్రవరి 15: (67), ఫిబ్రవరి 19: (69), ఫిబ్రవరి 23: (23) ఫిబ్రవరి 27: (52), మార్చి4: (49), మార్చి8: 40 నియోజక వర్గాలలో ఎన్నికలు నిర్వహించబడతాయి.
పంజాబ్:
మొత్తం సీట్లు: 117. ఎన్నికల తేదీ: ఫిబ్రవరి 4.
గోవా:
మొత్తం సీట్లు: 40. ఎన్నికల తేదీ: ఫిబ్రవరి 4.
మణిపూర్:
మొత్తం సీట్లు: 60. (రెండు దశలలో ఎన్నికలు నిర్వహించబడతాయి.)
ఎన్నికల తేదీలు: మార్చి4న : 38, మార్చి 8న : 22 నియోజక వర్గాలలో ఎన్నికలు నిర్వహించబడుతాయి.
ఉత్తరాఖండ్:
మొత్తం సీట్లు: 70. ఎన్నికల తేదీ: ఫిబ్రవరి 15.
ఐదు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు మరియు ఫలితాలు వెల్లడి: మార్చి 11.
ఐదు రాష్ట్రాలలో కలిపి మొత్తం 690 నియోజక వర్గాలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. మొత్తం 16 కోట్లు మంది ఓటర్లున్నారు. ఈ ఎన్నికల కోసం 1.18 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నారు. నేటి నుంచే ఆ 5 రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది.