సంబంధిత వార్తలు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ (64) చేత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుదవారం ప్రమాణస్వీకారం చేయించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా సిక్కు జాతికి చెందిన న్యాయమూర్తులకు అత్యున్నతమైన ఈ పదవిని చేపట్టే అవకాశం దక్కలేదు కనుక జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ కు అరుదైన ఆ గౌరవం దక్కింది. భారతదేశ 44వ ప్రధాన న్యాయమూర్తి (చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా) ఈరోజు బాధ్యతలు చేపట్టిన ఆయన ఈ ఏడాది ఆగస్ట్ 27వ తేదీ వరకు అంటే సుమారు ఏడున్నర నెలలు ఆ పదవిలో కొనసాగుతారు.