సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ (64) చేత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుదవారం ప్రమాణస్వీకారం చేయించారు.  భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా సిక్కు జాతికి చెందిన న్యాయమూర్తులకు అత్యున్నతమైన ఈ పదవిని చేపట్టే అవకాశం దక్కలేదు కనుక జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ కు అరుదైన ఆ గౌరవం దక్కింది. భారతదేశ 44వ ప్రధాన న్యాయమూర్తి (చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా) ఈరోజు బాధ్యతలు చేపట్టిన ఆయన ఈ ఏడాది ఆగస్ట్ 27వ తేదీ వరకు అంటే సుమారు ఏడున్నర నెలలు ఆ పదవిలో కొనసాగుతారు.