ప్రధాని మోడీ నేడు తిరుపతి పర్యటన

ప్రధాని నరేంద్ర మోడీ నేడు తిరుపతి పర్యటనకు రాబోతున్నారు. తిరుపతిలో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నేటి నుంచి జరుగబోయే 104వ అఖిల భారతీయ విజ్ఞాన సమ్మేళనం (సైన్స్ కాంగ్రెస్) సదస్సును ప్రారంభించేందుకు వస్తున్నారు. ఈ సదస్సుకు గవర్నర్ నరసింహన్, ఏపి సిఎం చంద్రబాబు నాయుడు, పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తదితరులు హాజరవుతారు. ఈ   సదస్సులో పాల్గొన్న తరువాత తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకొంటారు. కొండమీద కాటేజీలో కొంత సేపు విశ్రాంతి తీసుకొన్న తరువాత మళ్ళీ ఈరోజు సాయంత్రమే డిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. వివివిఐపిలు అందరూ వస్తునందున కొండ క్రింద, మీద చాలా బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.