నూతన సంవత్సర శుభాకాంక్షలు

తెలంగాణా రాష్ట్రాభివృద్ధి విషయంలో అధికార, ప్రతిపక్షాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, గత ఏడు దశాబ్దాలలో జరుగని అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గత రెండున్నరేళ్ళలో జరుగుతున్న మాట వాస్తవం. 2016 సంవత్సరంలో తెలంగాణా రాష్ట్రం కొన్ని సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, ఆ అవరోధాలను అన్నిటినీ అధిగమించుతూ అభివృద్ధిపధంశలోనే ముందుకు సాగిపోతుండటం అందరికీ చాలా ఆనందదాయకమే. 2017 సంవత్సరంలో కూడా మన రాష్ట్రం, దేశం ఆర్ధికంగా, పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా ఇంకా బాగా అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకొందాము. మైతెలంగాణా.కామ్ ను చాలా ఆదరిస్తున్న మా పాఠకులకి ప్రజలకి, ప్రవాస తెలంగాణావాసులు, భారతీయులు అందరికీ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు.