కొద్దిసేపటి క్రితం తెలంగాణా శాసనసభ బిఎసి కమిటీ సమావేశం ముగిసింది. జనవరి 11 వరకు (3, 4, 5, 6, 9, 11 తేదీలలో) శాసనసభ, మండలి సమావేశాలు కొనసాగించాలని నిర్ణయించారు. అవసరమయితే సమావేశాలను మళ్ళీ పొడిగించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంసిద్దత వ్యక్తం చేశారు. కనుక జనవరి 11వ తేదీన మళ్ళీ మరొకసారి బిఎసి కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
ఈరోజు జరిగిన బిఎసి కమిటీ సమావేశంలో జనవరి 6వ తేదీ వరకు శాసనసభలో చర్చించవలసిన అంశాలను కూడా ఖరారు చేశారు. జనవరి 3న మత్స్య సంపద అభివృద్ధి ( మిషన్ కాకతీయ పధకంలో భాగంగా జరిగిన చెరువుల పునరుద్దరణ వలన వాటిలో చేప పిల్లల పెంపకం చేపట్టడం ద్వారా గ్రామీణులకు ఉపాధి అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.) జనవరి 4న ఫీజ్-రీఇంబర్స్ మెంటు, 5న సింగరేణి కార్మికుల సమస్యలు, 6న ఎస్సీఎస్టీల పరిస్థితులు, సబ్ ప్లాన్ పై చర్చ జరుపాలని నిర్ణయించారు. బిఎసి కమిటీ సమావేశం ముగిసిన వెంటనే మళ్ళీ శాసనసభ సమావేశాలు మొదలయ్యాయి.