పార్టీ నుంచి ముఖ్యమంత్రి సస్పెండ్!!!

సాధారణంగా ముఖ్యమంత్రి లేదా పార్టీ అధ్యక్షుడు తమ పార్టీలో నేతలను, మంత్రులు లేదా ప్రజా ప్రతినిధులను సస్పండ్ చేస్తుంటారు. కానీ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ (పి.పి.ఏ.) తమ ముఖ్యమంత్రి పెమా ఖండూ, మరో ఆరుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం విశేషం. విశేషం ఏమిటంటే వారందరూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే కారణంతో సస్పెండ్ చేయబడ్డారు.

ఆ రాష్ట్రంలో కొన్ని నెలల క్రితం భాజపా కారణంగా రాజకీయ సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆయన 47 కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి 5 నెలలు క్రితమే పి.పి.ఏ.లో చేరి జూలై 27న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కానీ ఇంతలోనే సస్పెన్షన్ వేటు ఎదుర్కోవలసి వచ్చింది. కనుక ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి కూడా వైదొలగుతారా? తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో కలిసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి డాని సహాయంతో తన పదవిని కాపాడుకొనే ప్రయత్నం చేస్తారా? అనేది త్వరలోనే తెలుస్తుంది.