డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్

డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా అనిల్ బైజల్ ని నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన 1969 బ్యాచ్ కి చెందిన ఐ.ఎ.ఎస్. అధికారి ఆయన ఇది వరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఇంతకు ముందు డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా వ్యవహరించిన నజీబ్ జంగ్ డిశంబర్ 22న రాజీనామా చేయడంతో అనిల్ బైజల్ నియామకం అవసరమైంది.

నజీబ్ జంగ్ డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా చేసినంత కాలం ఆయనకీ డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్య ఏదో ఒక అంశం మీద వివాదం సాగుతూనే ఉండేది. అయన కేంద్రప్రభుత్వ వైఖరికి అనుకూలంగానే వ్యవహరించేవారు కనుక ఇప్పుడు ఆయన స్థానంలో లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు చేపడుతున్న అనిల్ బైజల్ కూడా అదేవిధంగా వ్యవహరించే అవకాశాలున్నాయి. అలాగే డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి కూడా ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో తలదూర్చే అలవాటుంది కనుక ఆయన కూడా కొత్త గవర్నర్ తో కూడా త్వరలోనే కత్తులు దూయవచ్చు.