డిశంబర్ 30 అర్ధరాత్రితో రూ.500,1000 నోట్ల గడువు తీరిపోతుంది. కనుక ఆలోగానే దేశప్రజలు అందరూ తమ వద్ద ఉన్న ఆ నోట్లని తమతమ బ్యాంక్ ఖాతాలలో జమా చేసుకోవలసి ఉంటుంది. నోట్ల రద్దు ద్వారా దేశంలో బారీగా పోగుపడిన నల్లధనాన్ని కేంద్రప్రభుత్వం వెలికి తీయాలని ఆశించింది. కానీ అది ఆశించినట్లు నల్లధనం అంతా పూర్తిగా బయటకి వచ్చినట్లు లేదు. అందుకే దాని కోసం మరో అస్త్రం సందించడానికి సిద్దం అవుతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
వాటి ప్రకారం మార్చ్ 31 తరువాత ఎవరి దగ్గరైనా రూ.500 లేదా రూ.1000 నోట్లు 10కి మించి ఉన్నట్లయితే వారి వద్ద ఉన్న మొత్తానికి 10 రెట్లు జరిమానా వేయాలని భావిస్తోందిట! దాని కోసం కేంద్రప్రభుత్వం నేడో రేపో ఒక ఆర్డినెన్స్ జారీ చేయబోతోందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలని కేంద్రప్రభుత్వం దృవీకరించలేదు, ఖండించలేదు.