నోట్ల రద్దు గురించి మోడీ ఏమన్నారంటే...

ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు పూణేలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీ మార్కెట్స్ నూతన క్యాంపస్ కి ప్రారంభోత్సవం చేసిన తరువాత నోట్ల రద్దు అంశం గురించే ఇంకా వివరంగా మాట్లాడారు. “మేము స్వల్పకాలిక ప్రయోజనాల కోసం కాక దీర్గకాళిక ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకొన్నాము. ఇవి తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చేసినవి కావు. కానీ ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలన్నీ తాత్కలికమైనవే. 

నోట్ల రద్దు, జి.ఎస్.టి.బిల్లు వంటివన్నీ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే. అనేక దశాబ్దాలుగా పెండింగులో ఉన్న అనేక పనులు, సంస్కరణలను మా ప్రభుత్వం ఈ మూడేళ్ళలో చేసింది. ఒకే తరంలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మార్చలన్నదే నా అభిమతం. ఈ మూడేళ్ళలో మనం సాధించిన అభివృద్ధి ఎంతో తెలుసుకోవాలనుకొంటే, మనం 2012-13నాటి దేశ ఆర్ధిక పరిస్థితులను ఒకసారి చూస్తే అర్ధం అవుతుంది. ఆ సమయంలో మన కరెన్సీ విలువ చాలా పడిపోయింది. కానీ ఇప్పుడు స్థిరంగా కొనసాగుతోంది. మన ఆర్ధిక వ్యవస్థని పటిష్టం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకొంటాము,” అని చెప్పారు.