శేఖర్ రెడ్డి అరెస్ట్!

ఇటీవల చెన్నైలో ఆదాయపన్ను శాఖా అధికారులు చేసిన దాడులలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి,అతని భాగస్వాములు శ్రీనివాసులు, ప్రేమ కుమార్ వద్ద రూ.180 కోట్లు నల్లధనం, 127 కేజీల బంగారం పట్టుబడిన సంగతి తెలిసిందే. శేఖర్ రెడ్డి, ఆయన భాగస్వాములను సిబిఐ అధికారులు బుదవారం అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరు పరుచగా కోర్టు వారికి వచ్చే నెల 3వ తేదీ వరకు రిమాండ్ విదించింది. వారిపై సిబిఐ అధికారులు సెక్షన్స్: 120(బి), 409 మరియు 420 క్రింద కేసులు నమోదు చేశారు.  

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావుకి శేఖర్ రెడ్డితో సంబంధాలున్నట్లు కనుగొన్న ఆదాయపన్ను శాఖా అధికారులు బుదవారం ఆయన ఇళ్ళపై, ఆయన కుమారుడు, బంధువుల ఇళ్ళపై కూడా దాడులు చేశారు. ఈ నల్లధనం వ్యవహారాలను అన్నిటినీ చూస్తున్న రామ్మోహన్ రావు కుమారుడు వివేక్ ని నేడో రేపో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం.  కనుక ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అత్యవసరంగా ఈరోజు మంత్రివర్గ సమావేశం నిర్వహించి రామ్మోహన రావుని పదవిలో నుంచి తొలగించబోతున్నట్లు తెలుస్తోంది.