సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో వెతికితే చాలా అకౌంట్లే కనిపిస్తాయి కానీ అవేమీ ఆయన స్వంత అకౌంట్లు కావు. ఆయన అభిమానులే ఆయన పేరుతో ఖాతాలు తెరిచి, ఆయనకి సంబంధించిన సమాచారం పెడుతున్నారు. ఇక వారికి ఆ శ్రమ లేకుండా కేసీఆర్ స్వయంగా @కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే హ్యాండిల్ తో ఫేస్ బుక్ లో ఖాతా తెరిచారు. అది ఆయనదేనని తెలియజేసేందుకు గుర్తుగా ఆయన ఫోటో క్రింద కేసీఆర్ అనే పేరు పక్కన చిన్న నీలి రంగు టిక్ మార్క్ కూడా ఉంటుంది. ఆ పేజికి మన స్వప్నం...మన లక్ష్యం బంగారు తెలంగాణా అని బ్యానర్ లో వ్రాయబడింది. ఆయన పేజికి 1,07,955మంది ఫాలో అవుతుండగా, ఇంతవరకు 1,08,020 లైక్స్ వచ్చాయి. దానిలో కేసీఆర్ నయీం కేసు గురించి నిన్న శాసనసభలో చేసిన ప్రసంగం, మిషన్ కాకతీయతో సహా చాలా వీడియోలు వగైరా పోస్ట్ చేయబడున్నాయి. త్వరలోనే ఆయన ట్విట్టర్ లో కూడా అకౌంట్ ఓపెన్ చేయబోతున్నారు. కేసీఆర్ ఫేస్ బుక్ ఖాతా చూడాలనుకొనే వారు ఈ లింక్ పై ప్రెస్ చేయండి: https://www.facebook.com/KalvakuntlaChandrashekarRao/