శేఖర్ రెడ్డి చంద్రబాబు బినామీ అట!

ఇటీవల చెన్నైలో ఆదాయపన్ను శాఖ అధికారులు జరిపిన దాడులలో తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన శేఖర్ రెడ్డి ఇంట్లో రూ.107 కోట్లు విలువగల రూ.2,000 నోట్లు, 127కేజీల బంగారు ఆభరణాలు పట్టుబడిన సంగతి తెలిసిందే. అదిగాక అతని వ్యాపార భాగస్వాములు ఇళ్ళలో నుంచి కూడా చాలా బారీగా డబ్బు బంగారం పట్టుబడింది. శేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి బినామీ అని ఏపి కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. చంద్రబాబుకి శేఖర్ రెడ్డితో బలమైన, సన్నిహిత సంబంధాలు ఉన్నందునే ఆయనని తితిదే బోర్డు సభ్యుడుగా నియమించారని రఘువీరా రెడ్డి ఆరోపించారు.

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా అటువంటి అనుమానాలే వ్యక్తం చేశారు. శేఖర్ రెడ్డిత్ ఏ పరిచయం లేకుండానే చంద్రబాబు నాయుడు ఆయనని తితిదే సభ్యుడుగా నియమించారా? అని ప్రశ్నించారు. శేఖర్ రెడ్డికి, చంద్రబాబు నాయుడుకి మద్య లావాదేవీలు ఉండే ఉండవచ్చని జగన్ అనుమానాలు వ్యక్తం చేశారు. వారి అనుమానాలు అర్ధరహితంగా కనిపిస్తున్నప్పటికీ, శేఖర్ రెడ్డి గతంలో తెదేపాలో పనిచేయడం, ఆ తరువాత ఆయననే చంద్రబాబు నాయుడు తితిదేలో సభ్యుడుగా నియమించడం ఆలోచించవలసిన విషయాలుగానే కనిపిస్తున్నాయి.