నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

ఇవ్వాళ్ళ మద్యాహ్నం 3గంటలకి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార నివాసం ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. డిశంబర్ 16నుంచి శాసనసభ శీతాకాల సమావేశాలు మొదలవుతున్నందున వాటిలో చర్చించవలసిన అంశాల గురించి నేడు చర్చిస్తారు. ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాల భర్తీ ప్రతిపాదనలకి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. తెలంగాణా జిల్లాల ఏర్పటు చేసిన తరువాత ప్రభుత్వం చేసిన కొన్ని మార్పులు , చేర్పులకి సంబందించిన బిల్లుకి ఈ సమావేశంలో ఆమోదిస్తారు. ఇవికాక హైదరాబాద్ కి కృష్ణానది నుంచి త్రాగునీరు తరలించేందుకు నిర్మాణ పనుల కోసం అవసరమైన నిధులని మంజూరు, తెలంగాణా బీసి కమీషన్ బిల్లు, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, సిద్ధిపేట జిల్లాలలో పోలీస్ వ్యవస్థ కోసం ఒక ఆర్డినెన్స్ ఈ సమావేశంలో ఆమోదిస్తారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలలో విద్యార్ధుల ఉపకార వేతనాలు, ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ వంటి అంశాలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే అవకాశం ఉంది కనుక వాటిని ఎదుర్కొనేందుకు ఈ సమావేశంలోనే తగిన వ్యూహం సిద్దం చేయవచ్చు.