
తెలంగాణ ఏర్పడి 12 ఏళ్ళు గడిచినా ఇంతవరకు తెలంగాణలో కొత్తగా ఒక్క విమానాశ్రయం ఏర్పాటు కాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2021లో కర్నూల్, 2024లో కడప, 2026లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏర్పాటయ్యాయి.
భోగాపురం (విశాఖ) విమానాశ్రయాన్ని జూలై 5న ప్రధాని మోడీ దీనిని ప్రారంభిస్తారు. జూలై 8 నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయి.
తెలంగాణ జరిగిన అభివృద్ధితో పోలిస్తే నేటికీ ఏపీ చాలా వెనుకబడి ఉంది. కానీ ఏపీలో విశాఖ, విజయవాడ, కడప, కర్నూల్, రాజమండ్రి, రేణిగుంట మొత్తం ఆరు విమానాశ్రయాలున్నాయి. వీటిలో మూడు రాష్ట్రం విడిపోయిన తర్వాత నిర్మించినవే.
కానీ కేసీఆర్ హయం నుంచి నేడు సిఎం రేవంత్ రెడ్డి వరకు తెలంగాణలో కొత్తగా విమానాశ్రయాల ఏర్పాటుకి ఎంతగా ప్రయత్నించినా ఒక్కటి కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. కానీ సిఎం రేవంత్ రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తుండటం వలన ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రాయాల ఏర్పాటుకి మార్గం సుగమం అయ్యింది.
కానీ వాటి నిర్మాణం ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పటికి పూర్తయి అవి అందుబాటులోకి వస్తాయో తెలీని పరిస్థితి నెలకొంది.