డిశంబర్ 16 నుంచి శాసనసభ సమావేశాలు

డిశంబర్ 16 నుంచి రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు మొదలవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం గవర్నర్ నరసింహన్ కి తెలియజేసింది. ఆయన అనుమతితో శాసనసభ సమావేశాల షెడ్యూల్ ప్రకటిస్తుంది. డిశంబర్ 10న మంత్రివర్గ సమావేశం నిర్వహించి, శాసనసభలో చర్చించవలసిన విషయాలని ఖరారు చేస్తారు. డిశంబర్ 14న అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో సమావేశం అవుతారు. ఆ సమావేశంలో జిల్లాల వారిగా వారు రూపొందించిన ప్రణాళికలపై చర్చిస్తారు. వాటిని శాసనసభకి సమర్పించి సభలో కూడా చర్చించే అవకాశం ఉంది. డిశంబర్ 15వ తేదీన ఉదయం 11.30గంటలకి శాసనసభలో సభా వ్యవహారాల సంఘం (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశమయ్యి సభలో చర్చించాల్సిన అంశాల అజెండా ఖరారు చేస్తుంది.