
ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ వీడియో సందేశంలో మాట్లాడుతూ, “నేను ఇక్కడ అమెరికా-ఇరాన్ యుద్ధం ఆపేందుకు ఆ దేశాధినేతలతో రేయింబవళ్ళు చర్చిస్తుంటే, అక్కడ తెలంగాణలో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టారని తెలిసింది.
కేసీఆర్ హయంలో అందరూ లక్షల కోట్లు పోగేసుకున్నారు. దానిలో వాటా ఇవ్వకుండా అంతా అన్నకే ఇచ్చేస్తున్నారని తండ్రితో గొడవపడ్డారు. ముఖ్యమంత్రి పదవిని కూడా అన్నకే కట్టబెట్టాలని తండ్రి అనుకున్నందుకే ఆమె తిరుగుబాటు చేశారు. కొత్త పార్టీ పెట్టారు. ఆమె వద్ద వేలకోట్ల అవినీతి సొమ్ము ఉంది. అదే ఇప్పుడు ఖర్చు చేస్తూ న్యూస్ పేపర్లలో ఫ్రంట్ పేజ్ ప్రకటనలు వేయించుకుంటున్నారు.
తన వద్ద ఉన్నది సరిపోదన్నట్లు ఇంకా లక్షల కోట్లు దోచుకోవడానికి, ముఖ్యమంత్రి పదవి కోసమే ఆమె టీఆర్ఎస్ పార్టీ పార్టీ పెట్టుకున్నారు....” అంటూ కేఏ పాల్ ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనేమన్నారో అయన మాటల్లోనే...
💠 నేను యుద్ధం లో బిజీ గా ఉంటె ,తెలంగాణ ను
— KMedia (@KMedia96) May 3, 2026
సర్వ నాశనం చేయడానికి కవిత పార్టీకి పెట్టింది
💠2008 లో కవిత ను నమ్మొద్దు అని కెసిఆర్ చెప్పారు
💠 కవిత పై KA పాల్ సంచలన ఆరోపణలు#KalvakuntlaKavitha#KAPAUL#KCR#telanganarashtrasena pic.twitter.com/66QSMKk1gQ