చో రామస్వామి కన్నుమూత

 ప్రముఖ నటుడు, తుగ్లక్ పత్రిక సంపాదకుడు, రాజకీయ విశ్లేషకుడు చో రామస్వామి (82) బుదవారం తెల్లవారు జామున చెన్నై అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ అక్కడ చికిత్స పొందుతున్నారు. విశేషం ఏమిటంటే, ఆయన దివంగత ముఖ్యమంత్రి జయలలితకి అత్యంత సన్నిహితుడు. ఆమెకి సలహాదారుడుగా కూడా పని చేశారు. ఆమె అంత్యక్రియలు మూసిన మరునాడే ఆయన మరణించారు. ఆయన అనేక నాటకాలు, సినిమాలలో నటించారు. అనేక సినిమాలకి స్క్రిప్ట్ అందించారు. ఆయన నటించిన మహమ్మద్ బీన్ తుగ్లక్ నాటకం అనే అయనకి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. కనుక ఆ పేరుతోనే తుగ్లక్ అనే పత్రికని స్థాపించి రాజకీయ పార్టీలపై, నేతలపై చాలా ధైర్యంగా వ్యంగ్యాస్త్రాలు సందించేవారు. ఆయన రాజ్యసభ సభ్యుడుగా కూడా పనిచేశారు. ప్రముఖ నటి రమ్యకృష్ణ మేనమామ ఆయన.