తెలంగాణ డిజీపీగా సీవీ ఆనంద్

తెలంగాణ డిజీపీగా సీవీ ఆనంద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డిజీపీగా చేస్తున్న బి.శివధర్ రెడ్డి ఈ నెల 30న పదవీ విరమణ చేయబోతున్నారు. కనుక నిబంధనల ప్రకారం ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను సిఫార్సు చేయగా వాటిని యూపీఎస్సీ ఆమోదించింది. వారిలో సీవీ ఆనంద్, 1994 బ్యాచ్‌కు చెందిన సౌమ్య, మిశ్రా, వినాయక్ ప్రభాకర్ ఆప్టే ఉన్నారు. వారి ముగ్గురిలో సీవీ ఆనంద్ సీనియర్ కావడంతో డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

 1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్‌ సర్వీసులో చేరిన కొత్తలో వరంగల్‌, ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాలలో ఏఎస్పీ, ఎస్పీగా పనిచేశారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో పని చేశారు.   హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి, హైదరాబాద్‌ నగర కమీషనర్‌, నగర ట్రాఫిక్ కమీషనర్‌గా, సైబరాబాద్ కమీషనర్‌గా, డైరెక్టర్ జనరల్, యాంటీ కరప్షన్ బ్యూరో వంటి అత్యున్నత పదవులలో పనిచేశారు. ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ పోలీస్ మెడల్, పోలీస్ మెడ ఫర్ గ్యాలంట్రీ వంటి అనేక మెడల్స్ అందుకున్నారు.