
శనివారం టీఆర్ఎస్ పార్టీ ఆవిష్కరణ సభలో ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన తండ్రి, మాజీ సిఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యలపై స్పందన కోల్పోయిన మర మనిషి తన తండ్రి అని ఆక్షేపించారు. ఆయన వాళ్ళ సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదన్నారు. కనుక తాను తెలంగాణ ప్రజలకు తల్లిగా బాధ్యత తీసుకొని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని వర్గాలకు న్యాయం చేస్తానన్నారు.
కేసీఆర్‌ని, బీఆర్ఎస్ పార్టీని ఎవరైనా పల్లెత్తుమాట అంటే ఆ పార్టీ నేతలందరూ మూకుమ్మడిగా వారిపై దాడి చేస్తుంటారు. కానీ కవిత నిన్న అంత తీవ్ర విమర్శలు చేసినా బీఆర్ఎస్ నేతలెవరూ కనీసం స్పందించలేదు. ఆమె ఏదో అనగానే వెంటనే జవాబు చెప్పలేకపోవచ్చు. కానీ 24 గంటలు గడిచిన తర్వాత కూడా ఆ పార్టీ నేతలు కవితకు సమాధానం చెప్పలేని నిసహయత ఆశ్చర్యం కలిగిస్తుంది.
అయితే ఆ పార్టీ సొంత మీడియా ‘నమస్తే తెలంగాణ’లో “కేసీఆర్: జన నేత..అసలు నిర్ణేత..ఉద్యమం, పాలన.. ఏదైనా కేసీఆర్‌తోనే అందరూ...” అనే హెడ్డింగ్ పెట్టి చాలా పెద్ద సమాధానమే ఇచ్చారు. కానీ దానిలో కూడా ఎక్కడ కల్వకుంట్ల కవిత పేరు పేర్కొనలేదు. మాజీ తాజా ప్రధానులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతల పేర్లను ప్రస్తావించి వారి చుట్టూనే రాజకీయాలు తిరుగుతుంటాయని మిగిలినవారందరూ నిమిత్తమాత్రులేనని పేర్కొంది. తెలంగాణ అంటే కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేస్తూ ప్రజలు ఆయన వెంటే నడుస్తారని పేర్కొంది. తద్వారా సిఎం రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత వంటి వారిని ప్రజలు ఆదరించరని వారికి తెలంగాణలో అవకాశం ఉండబోదని స్పష్టం చేసింది.
జన నేతే.. అసలు నిర్ణేత 💥
ఉద్యమం, పాలన.. ఏదైనా కేసీఆర్‌తోనే అందరూ 📣
రేపు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం 🎉
🎯 పార్టీలకు అతీతంగా నాయకుల చుట్టే రాజకీయం
✴️ విశ్వసనీయ నాయకుడి వెంటే ప్రజలు, కార్యకర్తలు
✅ ప్రగతిశీల పాలనకు చిరునామాగా నిలిచిన కేసీఆర్
📌 25 ఏండ్లుగా తెలంగాణ ప్రజలంతా… pic.twitter.com/8PvA67bC8C