
బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చేస్తున్న ‘పెద్ది’ టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయిన తర్వాత ఐటెం సాంగ్ కోసం బ్రేకులు పడటం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది. పెద్దిపై చాలా భారీ అంచనాలున్నాయి కనుక ఐటెం సాంగ్ విషయంలో కూడా ఎవరూ రాజీ పడటం లేదట!
మొదట 'జిగేల్ రాణీ' పూజా హెగ్డే అనుకున్నారు. తర్వాత మృణాల్ ఠాకూర్ అయితే బాగుంటుందనుకున్నారు. కానీ ఈ హై వోల్టేజ్ సినిమాలో ఎవరైనా కొత్త అమ్మాయి చేత చేయిస్తే బాగుంటుందని ‘కపుల్ ఫ్రెండ్లీ’ హీరోయిన్ మానస వారణాశి పేరు పరిశీలించారు.
కానీ చివరకు వీరెవరూ కాదు 'జాజికాయ జాజికాయ' సంయుక్తని ఈ పాటకు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఎంపికతో చాలా ఆలస్యమైంది. కనుక నేడో రేపో ఆమె పేరు ప్రకటించి సాంగ్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్, కోచ్ గౌరు నాయుడుగా శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. జగపతి బాబు, శివ రాజ్ కుమార్, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి అందిస్తున్నారు.
వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు దీనిని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న విడుదల చేయాలనుకున్నారు కానీ జూన్‌కి వాయిదా పడింది.