గోదారి గట్టుపైన... నేను నా పల్లెటూరు పాట!

సుమంత్ ప్రభాస్‌, నిధి ప్రదీప్ జంటగా చేస్తున్న ‘గోదారి గట్టుపైన’ సినిమా మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. సినిమా పేరులోనే ఇది గోదావరి జిల్లా కథని దర్శకుడు సుభాష్ చంద్ర చెప్పేశారు. గోదావరి జిల్లాల నేపధ్యంలో ఈ సినిమాలో చక్కటి ప్రేమ కథని చూపించబోతున్నామని చెప్పారు.

టీజర్‌, రెండు పాటలకు మంచి ఆదరణ లభించింది ఇప్పుడు ‘నేను నా పల్లెటూరు...’ అంటూ సాగే  మూడో పాటని ఈ నెల 22న విడుదల చేయబోతున్నట్లు తెలియజేస్తూ చక్కటి పోస్టర్ వేశారు. 

రామజోగయ్య వ్రాసిన ఈ పాటకి నాగ వంశీ సంగీతం అందించగా ఎంఎల్ఆర్ కార్తికేయన్ పాడారు.   

ఈ సినిమాలో జగపతి బాబు, రాజీవ్ కనకాల, లైల, దేవీ ప్రసాద్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వివా రాఘవ్, రోహిత్ కృష్ణ వర్మ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.    

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: సుభాష్ చంద్రం సంగీతం: నాగ వంశీ, కెమెరా: సాయి సంతోష్, స్టంట్స్: కార్తిక్ డంగ్రి,  ఎడిటింగ్: అనిల్ పాశాల చేశారు.

ఏసియన్ సినిమాస్ సమర్పణలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అభినవ్ రావు నిర్మించిన గోదావరి గట్టుపైన సినిమా మే 8న విడుదల కాబోతోంది.