నాగ బంధం సురసుర సుక్కలు సుట్టేద్దాం...

అభిషేక్ నామ దర్శకత్వంలో విరాట్‌ కర్ణ, నభ నటేష్ ప్రధాన పాత్రలలో ‘నాగ బంధం’ నుంచి “సురసుర సుక్కలు తేరా  సుట్టేద్దాం...” అంటూ సాగే హుసారైన పెళ్ళి పాట నేడు విడుదల చేశారు. జానపద శైలిలో కాసర్ల శ్యామ్‌ వ్రాసిన ఈ పాటకి జునైద్ కుమార్‌, అబే సంగీతం అందించగా అనురాగ్ కులకర్ణి, కాల భైరవ్, మంగ్లీ, సాహితి చాగంటి, నల్గొండ గద్దర్, కనకవ్వ కలిసి పాడారు.   

దైవశక్తి దుష్టశక్తికి మద్య సాగే సోషియో ఫ్యాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న నాగబంధంలో ఐశ్వర్యా మీనన్, మహేష్ మంజ్రేకర్, జగపతి బాబు తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

నాగ బంధం సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అభిషేక్ నామా, కెమెరా: సౌందర్ రాజన్ ఎస్, సంగీతం: జునైద్ కుమార్‌, అబే, నేపథ్య సంగీతం: జునైద్ కుమార్‌, చేశారు. 

ఎడిటింగ్: ఆర్‌సీ ప్రణవ్, యాక్షన్: కనల్ కన్నన్, వ్లాడ్ రింబర్గ్ (అమెరికా), రియల్ సతీష్, కేచా ఖాంఫక్దీ, నందు, రన్ నవారాచ్ (థాయిలాండ్), జూనియర్ వెంకట్, కొరియోగ్రఫీ: బ్రిందా, గణేష్ ఆచార్య, శ్రస్తి వర్మ చేశారు. 

ఈ సినిమాకు పాటలు: కాసర్ల శ్యామ్, కళ్యాణ్ చక్రవర్తి, శ్రీహర్ష ఆమని, డైలాగ్స్: కళ్యాణ్ చక్రవర్తి వ్రాశారు. 

లక్ష్మీ ఐరా మరియు దేవాంశ్ నామా సమర్పణలో నిక్ స్టూడియోస్ & అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి కలిసి 5 భాషల్లో ఈ సినిమా నిర్మిస్తున్న నాగ బంధం ఈ వేసవిలో విడుదల కాబోతోంది.