
విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్ళి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఇద్దరూ హనీమూన్‌కి వెళతారనుకుంటే, ఇద్దరూ తమ సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇద్దరూ కలిసి ‘రణబాలి’ చేస్తుండటమే హనీమూన్ అని సరిపెట్టుకోవాలేమో? అది కాకుండా విజయ్ దేవరకొండ-కీర్తి సురేష్ కలిసి ‘రౌడీ జనార్ధన’ చేస్తున్నారు.
రష్మిక ఓ పక్క భర్తతో కలిసి రణబాలి చేస్తూనే హీరోయిన్ ఓరియంటడ్ ‘మైసా’ చేసేందుకు సిద్దమవుతున్నారు. త్వరలోనే కేరళలో 16 రోజులు షూటింగ్ షెడ్యూల్ మొదలవుతుంది.
వైవాహిక జీవితం-రణబాలి-మైసా మద్య రష్మికకు సమయం ఎలా లభించిందో తెలీదు కానీ ప్రస్తుతం మైసా కోసం బ్యాంకాక్‌లో హ్యాండ్-టూ- హ్యాండ్ ఫైటింగ్‌లో శిక్షణ పొందుతున్నారు.
అయితే త్వరలో మైసా షూటింగ్ మొదలవుతుంది కనుక ఈ శిక్షణకు ఎక్కువ రోజులు సమయం లభించదు. కనుక రోజుకి 8 గంటలు కటిన శిక్షణ పొందుతున్నారు.
ఈ సినిమాలో గిరిజన పోరాట యోధురాలు మైసాగా రష్మిక మందన నటిస్తున్నారు. కనుక ఈ పాత్రకు తగ్గట్లుగా తన శరీరాకృతిని మార్చుకునేందుకు వ్యాయామాలు కూడా చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: రవీంద్ర పుల్లె, సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా:శ్రేయాస్ కృష్ణ, స్టంట్స్: అండీ లాంగ్ చేస్తున్నారు.
అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై అజయ్, అనిల్ సయ్యపురెడ్డి, వీరసాయి గోపా కలిసి మైసాని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో లేదా దసరా, దీపావళికి మైసా విడుదలయ్యే అవకాశం ఉంది.