
ఈ నెల 23న తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక ఆ రాష్ట్రంలో అన్ని పార్టీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కోలీవుడ్ నుంచి విజయ్ దళపతి టివికే పార్టీతో తొలిసారిగా ఈ ఎన్నికల బరిలో దిగుతున్నారు.
ఆయన సినీ నటుడు కనుక ఆయన ప్రచార శైలి కూడా కాస్త నాటకీయంగానే సాగడం సహజం. కనుక రెండు రోజుల క్రితం కన్యాకుమారిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు సైకిల్ తొక్కుతూ జనాలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
ఆయన ముందు కార్లలో సిబ్బంది, పార్టీ నేతలు వెళుతుంటే, వెనకే ప్రచార రధం వస్తోంది. భద్రతా సిబ్బంది ఆయన వెనుకే పరుగులు తీశారు. దారిలో ఒక చోట ఓ అభిమాని ఎర్రటి గులాబీపూల గుత్తిని ఆయనపైకి విసిరినప్పుడు ఎవరో 'బాంబు.. బాంబు' అని అరిచారు.
దాంతో అంత సూపర్ హీరో విజయ్ సైకిల్ వదిలేసి పరుగున వెనకే వస్తున్న ప్రచార రధంలో దూరిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ముఖ్యంగా ఆయన ప్రత్యర్ధులు వైరల్ చేస్తూ, మళ్ళీ దానికి పేరడీలు కూడా చేస్తూ నవ్వులు పూయిస్తున్నారు. ఈ వీడియో. మీరూ చూసి ఆనందించండి.
Massive trolling of TVK Joseph Vijay
— Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) April 14, 2026
😝😝😝👇🏽 pic.twitter.com/MZNMjmUJmk