జయ మృతి పట్ల పవన్ కళ్యాణ్ సంతాపం

దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతికి దేశవ్యాప్తంగా అనేకమంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా సంతాపం తెలియజేశారు. జనసేన పార్టీ తరపున ‘అమ్మ’కు నీరాజనం పేరిట వ్రాసిన ఒక లేఖలో ఆయన వ్రాసింది యధాతధంగా: 

విప్లవ నాయకి, తమిళనాడు ముఖ్యమంత్రి అయిన ప్రియతమ జయలలిత మరణం నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆమె సంపూర్ణ ఆయురారోగ్యాలతో తిరిగి ఇంటికి చేరుకొంటారని దేశప్రజలతో పాటు నేను ఆశించాను. అయితే ఆమె తిరిగిరాని లోకాలకు పయనమై మనల్ని అందరినీ తీవ్ర దుఃఖంలో వదిలి వెళ్ళారు. మూడు దశాబ్దాలకు పైగా తమిళనాడు, భారదేశ రాజకీయాలపై జయలలిత చెరగని ముద్ర వేశారు. తమిళ ప్రజలు ‘అమ్మ’గా కొలుచుకొనే జయలలిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ఆశగా, శ్వాసగా జీవించారు. పేద ప్రజల కోసం తమిళనాడు అంతటా ఆమె అమలుజరిపిన సంక్షేమ పధకాలు సదా అనుసరణీయం. మహిళా శక్తికి ప్రభల నిరదర్శనంగా నిలిచారు. ‘అమ్మ’ మరణం తమిళనాడుకే కాక యావత్ దేశానికి తీవ్ర లోటు. ఆమెకు మనః పూర్వక అంజలి ఘటిస్తూ, నా తరపున, జనసేన పార్టీ శ్రేణుల తరపునా సంతాపం వ్యక్తం చేస్తున్నా..

ఇట్లు పవన్ కళ్యాణ్