కేరళలో దుమ్ము లేపుతున్న సిఎం రేవంత్

ఈ నెల 9న కేరళ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా కేరళలో ఎన్నికల ప్రచారంలో దుమ్ము లేపుతున్నారు. కేరళ సిఎం పినరయి విజయన్‌ని లక్ష్యంగా చేసుకొని సిఎం రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలతో అధికార ఎల్డీఎఫ్ ప్రభుత్వం కలకలమవుతోంది. 

కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు కరుణాకరన్, ఉమన్ చాందీ హయంలోనే కేరళలో అభివృద్ధి జరిగింది. పంచాయితీ రాజ్ వంటి శాఖలలో అనేక సంస్కరణలు జరిగాయి. తెలంగాణలో కూడా మా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. కే

రళ సిం పినరయి విజయన్‌, ఆయన మంత్రులకు నేను ఓ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ మా తెలంగాణ రాష్ట్రానికి వస్తే మా పాలనలో తెలంగాణ ఎంతగా అభివృద్ధి చెందిందో మేము స్వయంగా చూపిస్తాము. మీ హయంలో కేరళలో జరిగిన ఒక్క అభివృద్ధి పనిని మీరు మాకు చూపించగలరా?

సిఎం పినరయి విజయన్‌ 5 ఏళ్ళ పాలన అన్ని రంగాలలో వైఫల్యానికి నిదర్శనంగా నిలిచిపోతుంది. కేరళ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌ కూటమిని గెలిపించుకోవాలి. ఇందుకు కేరళ ప్రజలు సిద్దంగానే ఉన్నారు. రేపు (పోలింగ్‌) తమ తీర్పు ప్రకటించనున్నారు. కనుక సిఎం పినరయి విజయన్‌ గద్దె దిగడానికి సిద్ధంగా ఉండాలి,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.